15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

22-10-2025 07:50 PM

జిల్లా సహకార అడిట్ అధికారి సత్యనారాయణ..

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని జిల్లా సహకార అడిట్ అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయంలో, కోరుట్ల చిన్నమెట్టుపల్లి, ఎకీన్ పూర్, మాదాపూర్, ఐలపూర్, పైడిమడుగు సింగల్ విండోల పరిధిలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రల ఇంచార్జులతో వరి ధాన్యం కొనుగోలు నిర్వహణపై జిల్లా సహకార అడిట్ అధికారి సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా సహకార అడిట్ అధికారి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వాహకులు కొనుగోళ్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ రిజిష్టర్ మల్లేశం. ఆడప్సన్ ఆఫీసర్ వేణుమాధవ్. సింగిల్ విండో కార్యదర్శులు బుచ్చయ్య, సంతోష్, మహేందర్, బాబా, జగదీష్, అనిల్,మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు. ట్యాబ్ ఆపరేటర్స్ పాల్గొన్నారు.