calender_icon.png 22 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల సేవలు మరువలేనివి.. పోలీసులు ఆరోగ్యంగా ఉండడం అవసరం

22-10-2025 07:46:57 PM

టిజిఐసిసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి..

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో పిఎస్ఆర్ గార్డెన్స్ లో పోలీసులకు మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై అవగాహన కల్పించుటకై జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, పోలీసులకు దేహదారుద్యం అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ సేవ చేయాలని కోరారు.

నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం 24 గంటలు పని చేసే పోలీసులు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరమని అన్నారు. పోలీసుల సేవలు మరువలేనివని, పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారని వారికోసం ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎస్పీని అభినందించారు. కార్యక్రమానికి  విచ్చేసినటువంటి డాక్టర్లకు అభినందనలు తెలియజేశారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటూ విధులు నిర్వహిస్తే సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంజనేయులు, డాక్టర్ రాజు గౌడ్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ కిరణ్, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ హరికుమార్ గౌడ్, డాక్టర్ గాయత్రి, డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు.