1 September, 2026 | 12:38 AM

మళ్లీ ‘నీట్’గా విఫలం

01-09-2026 12:00 AM

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పీజీ పరీక్షలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విలువైన సమయం వృథా అయ్యిందని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరీక్షల నిర్వహణ సంస్థ ఈ రెండు పరీక్షా కేంద్రాల్లో రీ నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే నీట్‌L యూజీ ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్న విషయం విదితమే.

విద్యార్థుల నిరసనల నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షను మరోసా రి నిర్వహించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం. తాజాగా నీట్ పీజీ పరీక్షలో తలెత్తిన సమస్యలు పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి ఎత్తిచూ పాయి.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలు వరుసగా బయటపడుతుండటం ఆందోళనకరం. కాగా, నీట్ పరీక్ష కోసం విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి చదువుతారు.

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్ష రాసేందుకు మానసికంగా సిద్ధమైన తరుణంలో మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి కల్పించడం ఏ మాత్రం సమంజసం కాదు. వాస్తవానికి నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణలో భారీ సంస్కరణలు చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, ఆ సంస్కరణలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని తాజా ఘటనతో తేలిపోయింది. వైద్య విద్యలో ప్రవేశం కోసం పోటీ తీవ్రంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో చిన్న పొరపాటు కూడా విద్యార్థి భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపుతుం ది. అందువల్ల నిర్లక్ష్యానికి ఏ మాత్రం తావుండకూడదు.

పరీక్షల నిర్వహణలో సాంకేతికత అవసరమే. కానీ, సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పక తప్పదు.

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వైద్య విద్య ప్రవేశ పరీక్షలో పదేపదే తప్పులు జరగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో విశ్వా సం సన్నగిల్లకముందే కేంద్ర ప్రభుత్వం, పరీక్షల నిర్వహణ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.