8 March, 2026 | 3:27 AM

జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ వాట్స్అప్ అకౌంట్

03-02-2026 03:20 PM

జనగామ,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  ప్రొఫైల్ తో వాట్సాప్ లో ఏ ఇతర సోషల్ మీడియా ద్వారా  వచ్చే  మెసేజ్ లకు ప్రజలు, అధికారులు స్పందించవద్దని కలెక్టర్ కోరారు. సైబర్ క్రైమ్ లకు సంబందించిన ఇలాంటి చర్యల పైన పోలీసు లకు ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆకతాయిలు చేసే ఇలాంటి సైబర్ మోసాలకు గురికావద్దని కలెక్టర్ కోరారు.