వాసవిపై తప్పుడు ప్రచారం తగదు
- ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేస్తున్నాం
- వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 22 (విజయక్రాంతి): ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్‌పై యూట్యూబ్ చానల్స్‌లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వాసవి గ్రూప్ నిర్మాణ సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు దశా బ్దాల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చెరువు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో చేపట్టలేదని స్పష్టంచేశారు.
ఇటీవల తమ సంస్థ కూకట్‌పల్లి ప్రాంతంలో చేపడుతున్న వాసవి సరోవర్ ప్రాజెక్టు చిన్న మైసమ్మ చెరువు స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్టు కొన్ని యూట్యూబ్ చానల్స్‌లో ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని చెప్పారు. మూడు దశాబ్దాలుగా తమ నిర్మాణ సంస్థ 30 రెసిడెన్షి యల్ ప్రాజెక్టులను, 17 కమర్షియల్ ప్రాజెక్టులను, 310 ఎకరాల్లో విల్లా ప్లాట్లను, 4,510 అపార్ట్‌మెంట్లను, 25 వేల హ్యాప్పీ రెసిడెంట్స్‌ను నిర్మించిందని వివరించారు.
ఇప్పటి వరకు 8 మిలియన్ చదరపు ఫీట్ల ఏరియాలో నిర్మాణాలు చేశామని, మరో ఐదేండ్లలో 50 మిలియన్ చదరపు ఫీట్ల ఏరియాలో నిర్మాణాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నమ్మకం, నాణ్యతను ప్రామాణికంగా తీసుకొని లీగల్, రెవె న్యూ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వాసవి అగ్రిమెంట్ చేసుకుంటుందని చెప్పారు. తమ కస్టమర్లను భయాందోళనలకు గురి చేసేలా తప్పుడు కథనాలను యూట్యూబ్ చానల్స్‌లో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు.
చెరువును ఆక్రమించలేదు.. దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాం
గత ప్రభుత్వం అభ్యర్థన మేరకు తమ సంస్థ చిన్న మైసమ్మ చెరువును దత్తత తీసుకొని రూ.7 కోట్ల కార్పొరేటర్ సోషల్ రెస్పా న్సిబులిటీ ఫండ్ వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని, అలాగే మరికొన్ని నిర్మాణ సంస్థలతో కలిసి రాజీవ్‌గాంధీ నగర్ కాలనీ ముంపు సమస్యను తీర్చేందుకు రూ.1.20 కోట్లు వెచ్చించి స్ట్రాం వాటర్ లైన్ ఏర్పాటు చేశామని అభిషేక్ చందా వివరించారు. అయితే చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని, ఈ పనుల కోసం లేక్ మధ్యలో వేసిన రోడ్డును తాము ఆక్రమించినట్టు ప్రచారం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ చెరువు అభివృద్ధి పనులు 2027లో పూర్తి అవుతాయని తెలిపారు. సమీపంలోని కోమటికుం ట చెరువును కూడా తమ సంస్థ అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ రెండు చెరువుల అభివృద్ధికి గతంలో ప్రభుత్వంతో ఎంవో యూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. అలాగే చెరువు నీరు సులువుగా వెళ్లేందుకు తమ పట్టాభూమి నుంచి సుమారు రెండున్నర ఎకరాలు ప్రభుత్వానికి గిఫ్ట్‌డీడ్ చేశామ ని చెప్పారు. తమ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల అనుమతులను తీసుకున్నామని పేర్కొన్నా రు. చెరువుల అభివృద్ధితోపాటు సీఎస్‌ఆర్ ఫండ్‌తో పేద పిల్లల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రసారం చేయడం సరికాదని అభిషేక్ చందా పేర్కొన్నారు.






