ప్రజావాణి వినతుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
కొత్తపల్లి,(విజయక్రాంతి): కుల సర్టిఫికెట్ల, నివాస ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈ బిసి , ఈడబ్ల్యూఎస్ లాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో కరీంనగర్ అర్బన్ , రూరల్ మండలం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వీటిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పరిష్కారం కలుగక, అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే జిపివో లాగిన్ లో ఉందని ఆర్ఐ లాగిన్ లో ఉందని ఎమ్మార్వో టేబుల్ పైన ఉందని తదితర కారణాలతో రెవెన్యూ సిబ్బంది కాలక్షేపం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆరోపించారు. అలాగే కరీంనగర్ రూరల్ మండల రెవెన్యూ అధికారి గారికి సమస్యల పట్ల అవగాహన లేకుండా పోయింది సమస్యల కోసం వచ్చిన వారికి సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారను, జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇలాంటి సమస్యలు లేకుండా సమస్యలు తెలిసిన ఎమ్మార్వో గారిని కరీంనగర్ రూరల్ మండలానికి పంపించి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని , ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పత్రిక ముఖంగా కోరుచున్నామని అన్నారు.






