calender_icon.png 20 February, 2026 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సం‘క్షామ’ హాస్టళ్లు

22-11-2025 12:29:57 AM

- తనిఖీలు సరే..

- పరిస్థితిలో మార్పేదీ మరి?

మహబూబాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యా ప్తంగా ప్రభుత్వ సంక్షేమ, గురుకుల విద్యాలయాల్లో నూతన మెనూ పాటించకపోవడం, చాలా చోట్ల విద్యార్థుల భోజన వసతి సౌక ర్యం సరిగా లేకపోవడం, నాణ్యమైన నిత్యవసర వస్తువులు వినియోగించకపోవడంతో సంక్షేమం కాస్త సం‘క్షామం’గా మారిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కష్టంగా చదువులను సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అ దనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు తరచుగా సంక్షేమ హాస్టల్లను త నిఖీ చేస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మా ర్పు రావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన మె నూ అమలు చేయడంతో పాటు, డైట్ చార్జీలను కూడా పెంచి ఎక్కడ కూడా రాజీ పడ కుండా విద్యార్థులకు భోజన వసతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కని పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ, మోడల్, వివిధ గురుకులాలు, సంక్షేమ హాస్టల్లల్లో ఎక్కడ చూసినా విద్యార్థులకు సక్రమంగా భోజనం, అల్పాహారం పెట్ట డం లేదని నిత్యం విమర్శలు వస్తున్నాయి. అలాగే వసతి సౌకర్యం కూడా చాలాచోట్ల సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వం ఓవైపు పేద విద్యార్థులకు మె రుగైన వసతి కల్పించి, విద్యా బోధన చక్కగా అందించి ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా అధికారులు, నిర్వాహకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ప్రతి నెలలో కనీసం నాలుగు సార్లు జిల్లా స్థాయి అధికారులు గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండ లం కలవల మోడల్ స్కూల్ విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, వందమంది ఉండాల్సిన హాస్టల్లో పరిస్థితుల కారణంగా 30 మంది ఇంటికి వెళ్లిపోయి అక్కడ నుండి చదువుకోవడానికి వచ్చి వెళుతుండగా, పురుగుల అన్నం పెడుతున్నారని 50 మందికి పైగా ఇక తాము ఈ హాస్టల్లో ఉండే పరిస్థితి లేదం టూ ధర్నాకు దిగిన ఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

జిల్లాలో గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ, విద్యాశాఖలో కొం దరు డిప్యూటేషన్ పై నియమితులై ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సమస్యలకు మ రో కారణంగా చెబుతున్నారు. ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న సూపర్వైజింగ్ అధికారులను మచ్చిక చేసుకుని కొందరు నిర్వాహ కులు, ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వెంటనే ఏళ్ల తరబడిగా విద్యాశాఖలో డిప్యూటేషన్ పై నియమితులైన ఉపాధ్యాయులను బదిలీ చేసి కొత్తవారిని నియమిస్తే కొంత మార్పు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొక్కుబడిగా తనిఖీలు

జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు మం డలాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ప్రతి నెలలో కనీసం నాలుగు సార్లు వారి పరిధిలో ఉన్న గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలె క్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. అయితే అనేకసార్లు జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ కేవలం అక్కడ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేసి వెళ్లిపోవడం మినహా, అద్వాన్నకర పరిస్థితులు ఉన్నచోట మార్పు కోసం గట్టి చర్యలు తీసుకోవడం, ఉన్నతాధికారులకు నివేదించడం లాంటి చర్యలు పెద్దగా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఫలితంగా అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించి వెళ్లిపోవడంతో మొక్కుబడిగా ఈ వ్యవహారం మారిందనే విమర్శలు వస్తున్నాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే నిర్వాహకులు, ప్రిన్సిపాళ్ళు, బోధన, బోధనేతర సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడంతో తనిఖీలు ‘మ మ’ అనే రీతిగా మారిపోయాయని విమర్శలు వస్తున్నాయి. 

సకాలంలో వేతనాలు లేవు

గురుకులాలు, హాస్టళ్లలో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బందికి ప్రతినె ల వేతనాలు చెల్లించకపోవడం, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గురుకులాలు, హాస్టళ్ల నిర్వహ ణ అస్తవ్యస్తంగా మారడానికి ఒక కారణంగా చెబుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సరుకులు సరఫ రా చేయడం నిలిపివేయడం, నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారని, దీని వల్ల నిర్వాహకు లు జేబు నుంచి ఖర్చుపెట్టి గురుకులాలు, హాస్టళ్లను నిర్వహించడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు. బోదనేతర సిబ్బందికి సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడంతో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనివల్ల గు రుకులాలు, హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడానికి కారణంగా చెబుతున్నారు. 

షటిల్ సర్వీసులు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లల్లో పనిచేసే వారిలో 90 శాతం నిర్వాహకులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు పనిచేసే చోట నివాసం ఉండకుండా జిల్లా కేంద్రం, తమకు అనుకూలంగా ఉన్న ప్రాం తాల్లో నివసిస్తూ నిత్యం షటిల్ సర్వీసులు చేయడం వల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడానికి మరో కార ణంగా చెబుతున్నారు. అధికారి మొదలుకొని అటెండర్, నైట్ వాచ్మెన్, కేర్ టేకర్, ఏ ఎన్‌ఎం వరకు అంతా తాము పనిచేసే చోట నివాసం ఉండకపోవడం వల్ల వచ్చిపోతుండడంతో గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ ‘ఆయారామ్ గాయారామ్’ అన్న తరహాలో మారాయని చెబుతున్నారు.

పనిచేసే చోట నివాసముంటే పర్యవేక్షణ సక్రమంగా ఉంటుందని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, షటిల్ సర్వీసులు చేయడం వల్ల పట్టించుకునే నాధుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. 

సక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో విధు లు నిర్వహించే అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలి.  ప్రతి నెలలో కనీసం నాలుగు సార్లు జిల్లాస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, తనిఖీల్లో గమనించిన లోటుపాట్లను జిల్లా స్థాయి అధికారులకు నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. 

తనిఖీ అధికారుల నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన వారిపై మార్పు కోసం కఠిన చర్యలకు ఉపక్రమించాలి.  విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు తమ పరిధిలో ఉన్న విద్యాలయాలు, గురుకులాలు, హాస్టళ్లల్లో సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. అయినప్పటికీ సమస్యలు తలెత్తితే పర్యవేక్షణ అధికారులను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. 

గురుకులాలు, హాస్టళ్లల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యో గులు, సిబ్బందికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. నిత్యవసర సరుకులు, చికెన్, మటన్, పాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించాలి.నాణ్యతలో రాజీ పడకుండా సరఫరా చేసే విధంగా కఠిన ప్రణాళిక రూపొందించాలి.

గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ, పేరెంట్స్ కమిటీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.  ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా జిల్లా స్థాయిలో అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి.