calender_icon.png 22 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు

22-11-2025 01:00:28 AM

భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేసిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దశాబ్దాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులను భారీగా ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. వ్యాపార విస్తీర్ణాన్ని రికార్డుల్లో తక్కువగా చూపించి, ప్రభుత్వానికి లక్షలాది రూపాయల నష్టం కలిగిస్తున్నట్లు తేలడంతో తక్షణమే పూర్తి స్థాయి ఫీజులను బకాయిలతో సహా చెల్లించాలని రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు ఇటీవల నగరంలోని వాణిజ్య సంస్థల ట్రేడ్ లైసెన్స్ వివరాలను, వారు చెల్లిస్తున్న ఫీజులను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ఈ తని ఖీల్లో అన్నపూర్ణ స్టూడియో రూ.11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.49 వేలు మాత్ర మే చెల్లిస్తున్నట్లు గుర్తించారు. రామానాయుడు స్టూడియో రూ.1.92 లక్షలుచెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టు బట్టబయలైంది.

సంవత్సరాలుగా ఈ రెండు స్టూడియోలు తమ వ్యా పార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి, నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ జీహెచ్‌ఎంసీకి భారీగా న ష్టం చేకూరుస్తున్నాయని అధి కారులు తెలిపా రు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి, వాస్తవ విస్తీర్ణాన్ని లెక్కించి, పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను బకాయిలతో సహా తక్షణమే చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.