22-11-2025 12:00:00 AM
-15 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తాం..
-డిప్యూటీ ఈ ఈ యాదయ్య..
బండ్ల గూడా జాగీర్, నవంబర్ 21(విజయక్రాంతి ): బండ్ల గూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫైబల్ సిటీ రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి..”చిన్నపాటి వర్షానికె చిత్తడి అవుతున్న ఫైనల్ సిటీ రోడ్డు” అనే కథనం ఈ నెల 14 కదనం ప్రచురితం కావడం తో స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర డిప్యూటీ ఈ ఈ యాదయ్య తో మాట్లాడి ఫైబల్ సిటీ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చెయ్యడం తో గత రెండు రోజుల క్రితం రోడ్డు పై ఉన్న మట్టిని తొలగించి కంకర పరిచి నట్లు శుక్ర వారం విజయ క్రాంతి కి వివరించారు అసిస్టెంట్ ఈ ఈ రాజేష్ కుమార్ క్షేత్ర స్థాయిలో దగ్గర ఉండి పనులు చూస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు తీసుకున్న డెల్టా గ్లోబల్ సర్వీసెస్ ఏజెన్సీ 800 మీటర్ల పొడవున చేస్తున్న ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ జర్నల్ ఫండ్ నుండి ఒక కోటి రూపాయలు మంజూరు చేశారు..మరో 10 నుండి 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని డిప్యూటీ ఈ ఈ యాదయ్య తెలిపారు...