17-07-2025 01:50:53 AM
స్థానిక ఎన్నికల వర్క్‌షాప్‌లో బీజేపీ చీఫ్ పిలుపు
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాడానికి పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీ ఘట్కేసర్ డివిజన్, మం డల పార్టీ అధ్యక్షులకు లోకల్ బాడీ ఎన్నికలపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.
బూత్‌లోనే గెలుపు జన్మిస్తుందనే విషయాన్ని గుర్తించి ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని వారిని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహిం చాలన్నారు. ప్రతి డివిజన్, మండలస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను కోరారు. ఒక్కో బూత్ గెలిస్తే ఒక్కో నియోజకవర్గం మనదవుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గం మనదైతే తెలంగాణ బీజేపీ వశమవుతుందన్నారు. కార్యశాలలో పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.