22 July, 2026 | 3:46 AM

రైతు నేస్తాలు.. కృషి విజ్ఞాన కేంద్రాలు

02-06-2024 12:05 AM

జహీరాబాద్, జూన్ 1 : సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేధ్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ పరిశోధన కేంద్రం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే అరవింద్‌కుమార్ అన్నారు. శనివారం జహీరాబాద్ మండలం పస్తాపూర్ లోని డీడీఎస్ కేవికే ఆధ్వర్యంలో కేవికే స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 1974లో తమిళనాడు లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాండిచ్చేరిలో మొట్టమొదటిసారిగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. 2024నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను జరుపు కుంటుందన్నారు. దేశ వ్యాప్తంగా 731కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుల కోసం నిరంతరం పని చేస్తున్నాయ న్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రమేశ్, శైలజ, ప్రియంక, స్వామి పాల్గొన్నారు.