యూరియా కోసం రైతు కన్నీరు
13-08-2026 12:53 AM
- అటెండర్ కాళ్లపై పడి వేడుకోలు
- చిన్న ఫోనే ఉంది.. యాప్ గురించి తెల్వదంటూ ఆవేదన
కొల్చారం, ఆగస్టు 12: యూరియా కోసం వచ్చిన ఓ రైతు ఆవేదన రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉన్న రైతులను కలచివేసింది. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కొనుగోలు చేసేందుకు రంగంపేట సొసైటీకి వచ్చాడు.
అయితే మొబైల్ ఫోన్ ద్వారా పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. “నా దగ్గర చిన్న ఫోన్ ఉంది. యూరియా సంచులు తీసుకోవాలంటే ఈ కొత్త విధానాలు నాకు తెలియడం లేదు. ఎవరైనా సాయం చేయా లి” అంటూ సహకార సంఘం అటెండర్ బిక్షపతి కాళ్లపై పడి వేడుకున్నాడు.






