బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్
13-08-2026 12:52 AM
హైదరాబాద్--చెన్నై మార్గంలో చేర్చాలి
కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ చామల వినతి
- నల్లగొండ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రతిపాదిత హైదరాబాద్ హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్‌లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా చేర్చే విషయాన్ని పరిశీలించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి బుధవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పే ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.






