30 August, 2026 | 2:52 PM

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ

11-06-2024 02:29 AM

హరీష్‌రావు రాజీనామా సిద్ధం చేసుకోవాలి 

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ లోగా హరీష్‌రావు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు.  సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై చేసిన ఛాలెంజ్‌కు హరీష్‌రావు కట్టుబడి ఉండాలని సవాల్ చేశారు. 

ఇప్పటివరకు 68 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధును ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను రూపొంది స్తున్నామని, ఆలస్యం కాకుండా అనుకున్న సమయంలో రైతు భరోసా ఇస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీనివాస్ తెలిపారు.