calender_icon.png 14 July, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నా.. జర భద్రం..!

14-07-2025 12:00:00 AM

  1. నడుస్తుంది నకిలీ విత్తనాల మాయాజాలం!
  2. అధికారుల హెచ్చరికలు... రైతుల అవగాహనే రక్షణ

*నకిలీ విత్తనాల బెడద అంతకంతకూ పెరిగిపోతోంది. ఏప్రిల్, మే మాసాల్లో వీటి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి. నకిలీ విత్తనాలతో అన్నం పెట్టే రైతు మాత్రమే కాకుండా సేద్యం రంగం తీవ్రంగా నష్టపోతుంది’.

గంభీరావుపేట, 13 జులై (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై సాగు సీజన్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రత్యేకించి పత్తి, వరి విత్తనాల్లో నకిలీల దెబ్బతో మొలకలే రాని పరిస్థి తులు ఏర్పడుతున్నాయి. తక్కువ ధరల ఆకర్షణకు లోనై నాసిరకం విత్తనాలు కొను గోలు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విక్రయాలు...

ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశిస్తుంటాయని సమాచా రం. ఇవి ప్రామాణిక బ్రాండ్ల పేరుతో కాకుం డా, నాన్-బ్రాండెడ్ ప్యాకెట్లలో అమ్ముతున్నా రు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, ఈ తరహా విత్తనాలు అధికంగా అనధికారిక మార్కెట్ల ద్వారా రైతుల చెంతకు చేరుతున్నాయి.

అధిక భారం..

నకిలీ విత్తనాలకు చీడ పీడలను తట్టుకునే శక్తి ఉండదు. దీనివల్ల పురుగు మందులను అధిక మొత్తంలో వాడవలసి ఉంటుంది. అ ది రైతులకు ఆర్థిక భారమవుతుంది. పైగా అ ధిక పురుగు మందుల వాడకం వలన భూ మి సారం తగ్గుతుంది.

తక్కువ ధర... భారీ నష్టం!

నకిలీ విత్తనాలు ఎక్కువగా తక్కువ ధరలకు అమ్ముతూ రైతులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు డీలర్లు చెప్పే విత్తానాలనే వినియోగిస్తారు. కొంతమంది డీలర్లు అధిక ధనార్జన కోసం నాసిరకం నాన్-బ్రాండెడ్ ఉత్పత్తులు రైతుల కు అంటగడుతున్నారు. వీటిని వేసిన తరువాత మొలకలే రాకపోవడం, మొలక వచ్చి నా ముల్లు మొక్కలుగా మారడం వంటి సం ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి.

తనిఖీలు దాడులు..

ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తూ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వ యంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసింది. ఈ బృందాలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, నకిలీ విత్తనాల అమ్మకాలు పూర్తిగా ఆగడం లేదు. కొన్ని తనిఖీలు ఊరి చూపు కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విత్తనాల ధృవీకరణపై నిపుణుల సూచనలు..

విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో క్రింది అంశాలపై రైతులు శ్రద్ధ వహించాలంటున్నారు. ప్రభుత్వ ధృవీకరణ ఉన్న బ్రాం డెడ్ విత్తనాలనే కొనుగోలు చేయాలి. రసీదు తీసుకోవడం తప్పనిసరి. ప్యాకింగ్ డేట్, గడువు తేదీ, లాట్ నంబర్ పరిశీలించాలి. అనుమానం వచ్చినవాటిని తక్షణం గ్రామ వ్యవసాయాధికారులకు తెలియజేయాలి.

ప్రభుత్వ ఆదేశాలతో విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం

 స్టాక్, రిజిస్టర్లు, లైసెన్సు ల పరిశీలనతో పాటు, నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన డిలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు ప్రభుత్వం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు అమ్మిన , రసీదు లేకుండా అధిక ధరలకు విక్రయించిన వారి లైసెన్సు రద్దు చేస్తాం.

 మారుతి రెడ్డి, ఎమ్మార్వో,

గంభీరావుపేట