calender_icon.png 16 July, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తు మన బాధ్యత

14-07-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి); విద్యార్థుల భవిష్యత్తు మన అందరి బాధ్యత అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణం లో గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మా విద్యార్థులతో ప్రత్యక్షంగా సమావేశమై వసతులు భోజనం సదుపాయాలు పాఠశాల వాతావరణం తదితర అంశాలపై పాఠశాల సిబ్బంది తో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య భద్రత ఆరా నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు సహించ బడవని తెలిపారు. పిల్లల భవిష్యత్తు మన బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురుకులంలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం  వయించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఉడుముల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతల శంకర్, ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు