14-07-2025 12:00:00 AM
సీఎం, జుక్కల్ ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
మద్నూర్, జులై 13(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన సందర్భంగా ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సిఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై చర్యలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో శివాజీ పటేల్, శశాంక్ పటేల్, ఉమాకాంత్ పటేల్, పురుషోత్తం పటేల్, నగేష్ పటేల్, సంగ్రామ్ పటేల్, విలాస్, శ్రీకాంత్, శ్రీధర్,నాగనాథ్, హన్మంత్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ ప్రజలు పాల్గొన్నారు.