యూరియా కోసం రైతు నిరీక్షణ
- చెప్పులు క్యూలో పెట్టిన రైతులు
- పోలీసుల పహారాలో పంపిణీ
- యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ చేగుంట రహదారిపై రాస్తారోకో
చేగుంట, ఆగస్టు 18 : పోలీస్ సహారా మధ్య యూరియా పంపిణీ, వరుసలో చెప్పులు పెట్టి యూరియా కోసం నిరీక్షణ, మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తాయంటున్నా రైతులు , వివరాలకు వెళితే మంగ ళవారం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్, నార్సింగి, చేగుంట, మండలాల రైతులు యూరియా బుక్ చేసుకొని 24 గంటలు కా వస్తున్న యూరియా అందడం లేదని, చిన్న శంకరంపేట్ రైతులు ఉదయం ఆరు గంటల నుండి ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద ఉద యం 6 గంటల నుండి రైతు సేవ కేంద్రం వద్ద వరుసలో చెప్పులు పెట్టి నిలబడడం జరిగింది,
విషయం తెలుసుకున్న చిన్న శంకరంపేట పోలీసులు ఎలాంటి అవాంఛనియా సంఘటన జరగకుండా, వచ్చి పోలీస్ ప్రా రంభ యూరియా పంపిణీ చేయడం జరిగిం ది, అనంతరం రైతులు కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా లభించక పంటలు దె బ్బతింటున్నాయని, నిత్యం తిప్పలు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేగుంట - మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరి యా కొనుగోలు కోసం తీసుకొచ్చిన కొత్త యాప్ వల్ల సామాన్య రైతులకు తీవ్ర అన్యా యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. స్మార్ట్ఫోన్లు, సాంకేతిక పరిజ్ఞానం లేక, నె ట్వర్క్ సమస్యల కారణంగా యాప్లో నమో దు చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.
సమయానికి యూ రియా దొరక్క వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపో యారు. వెంట నే ఈ యాప్ విధానాన్ని స్వ స్తి చెప్పి, పాత పద్ధతిలోనే సహకార సంఘా లు (సొసైటీలు), రిటైల్ డీలర్ల ద్వారా ఉచితంగా, సరిపడా యూరియాను అందుబా టులోకి తేవాలని డిమాండ్ చేశారు.
స్తంభించిన రహదారి
రైతులు రోడ్డుపై బైఠాయించడంతో చే గుంట - మెదక్ మార్గంలో ఇరువైపులా వా హనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ సం ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన యూరియా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.






