ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్..
అధికారులకు క్లాస్
నాగల్గిద్ద, ఆగస్టు 18 : మండల కేం ద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యా లయంలో ఎంపీడీవో మహేశ్వరరావు, మం డల ప్రత్యేక అధికారి, నారాయణఖేడ్ స బ్కలెక్టర్ ఉమా హారతి అధ్యక్షతన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మం డల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రా మాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృ ద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులు, సర్పం చులను అడిగి విద్యుత్, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమ స్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో విద్యు త్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అ ధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ చ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిం చాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యా ర్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు. తాగునీటి సరఫరాను మెరు గుపరచడంతో పాటు రహదారులకు మర మ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశం లో ఎమ్మార్వో సంగ్రామ్రెడ్డి, ఎంపీడీవో మహేశ్వరరావు, ఏవో ప్రవీణ్చారి, ప్రశాంతి, అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.






