ప్రజావాణిలో రైతుల ఆవేదన
రైతు భరోసా, యూరియా బుకింగ్, వడ్ల అమ్మకంలో ఇబ్బందులు
దరఖాస్తులు పరిశీలించి న్యాయం చేస్తామన్న ఎంపీడీవో చలపతి
తుంగతుర్తి ఆగస్టు 24: రైతు భరోసా రావడం లేదని, అలాగే వడ్ల అమ్మకం, యూరియా బు కింగ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ప్రజావాణిలో అధికారు లైన ఎంపీడీవో చలపతి ఎమ్మార్వో దయానందములకు ఫిర్యాదు చేశారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన గుడిపూడి ఆగారావు, దుగ్యాల హనుమంతరావు, శంకరమంచి రవీందర్ శర్మలు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు.
గత రెండు సంవత్సరాలుగా తమకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయని, రైతుబంధు నిధులు తమ ఖా తాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.యూరియా యాప్లో యూరియా బుక్ చేసుకోవడానికి, ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను విక్రయించడానికి అవకాశం లభించడం లేదని వాపోయారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగామని, అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని బాధిత రైతులు వాపోయారు. సో మవారం మొత్తం 6 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని వారు ప్రజావాణిలో కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






