25 August, 2026 | 6:52 AM

నరకాన్ని తలపిస్తున్న ప్రధాన రహదారి

25-08-2026 12:00 AM

ఏళ్ల తరబడిగా పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు 

 బోయినపల్లి: ఆగస్టు 24( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి వరద కాలువ వద్ద రహదారి నరక కూపంగా మారింది. వర్షాకాలంలో చినుకు పడితే చిత్తడి చిత్తడిగా మారి ప్రయాణికులకు మండల ప్రజలకు శాపం గా మారి ఈ రహదారి నరకాన్ని తలపిస్తుంది. బోయినపల్లి మండల కేంద్రం నుం చి కొదురుపాక ప్రధాన రహదారికి వెళ్లే దా రిలో వరద కాలువ నిర్మాణం జరిగింది.

ఈ వరద కాలువ దేశాయిపల్లి వద్ద అప్పట్లో వర ద కాలువ కాంట్రాక్టర్ సి సి రహదారివేసినప్పటికీ నాణ్యత లోపంతో ఏడాది కాలంలో నే మొత్తం సీసీ లేచిపోయి గుంతలమయమైంది. దాదాపు 8 ఏళ్లకు పైగా ఈ రహదారి ప్రతి వర్షాకాలంలో వర్షాలు పడి నీరు నిలి చి పెద్దపెద్ద గోతులు పడి ప్రయాణికులకు మండల ప్రజలకు ప్రయాణానికి వీలు లే కుండా పోయింది. అందులోంచి వెళ్లిన కా ర్లు లారీలు ద్విచక్ర వాహనాలు మట్టిలో కూ రుకుపోయి మళ్లీ ఇతర వాహనాల సహాయంతో బయటకు తీశారు.

అదేవిధంగా కనీ సం వాహనం నెట్టుకొని వెళ్దామన్నా కూడా కాలినడక కూడా నోసుకోవడం లేదు. ఈ రహదారి పైనుంచి మండల స్థాయి అధికారులు అదేవిధంగా ఉద్యోగులు వాహనాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం విధులకు హాజరవుతున్నారు. బోయినపల్లి నుంచి, కొదురుపాక వైపు నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, వంతెన వద్ద ఈ రహదారి పై నుంచి వెళ్లడం అంతకు మించిన భారం కష్టం అవుతుంది.

ఉద్యోగులు రైతులు నానా ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రధాన రహదారి బోయినపల్లి మండల కేంద్రంలో పాటు గం గాధర జగిత్యాల ప్రాంతాలకు వెళ్లేందుకు అ త్యంత ముఖ్యమైనది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇప్పటికైనా ఈ రహ దారిని పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేయాల ని మండల ప్రజలు రైతులు కోరుతున్నారు.