calender_icon.png 14 July, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి పంట విధ్వాంసాన్ని నిరసిస్తూ.. రైతుల ఆత్మహత్యాయత్నం

14-07-2025 12:31:07 AM

- బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఘటన

- అడ్డుకున్న పోలీసులు...

- రైతుకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే వినోద్ హామీ..

బెల్లంపల్లి అర్బన్, జూలై 13: బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పత్తి రైతులు పెట్రోల్, పురుగుల మందులతో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది... వివరాలు ఇలా ఉన్నాయి. నెన్నెల మండలానికి చెందిన కాశిపాక రాజంతో పాటు  పది మంది రైతులు 20 ఏళ్లుగా సర్వే నెంబర్లు  671, 672 పట్టా భూముల్లోని 20 ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. శుక్రవారం ఫారెస్ట్ అధికారులు వెళ్లి అక్రమంగా పంట సాగు నేపంతో 20 ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా వ్యవసాయ మోటర్, పైపులను సైతం ఫారెస్ట్ అధికారులు తీసుకువెళ్లారు. దీంతో కలత చెందిన బాధిత రైతుల్లో ఒకరైన కాశిపాక రాజం శనివారం బెల్లంపల్లిలో మీడియాకు  తన గోడును మొరపెట్టుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో కాశిపాక రాజంతో పాటు బాధిత రైతు కుటుంబ సభ్యులు పెట్రోల్, పురుగుల మందు డబ్బాలు, పత్తి మొక్కలతో బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని పెట్రోల్ పోసుకొని పత్తి రైతులు ఆత్మహత్యకు యత్నిం చారు.

అక్కడే ఉన్న గురిజాల ఎస్త్స్ర రమేష్, వన్ టౌన్ ఎస్‌ఐ రాకేష్ పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో క్యాంప్ ఆఫీస్ వద్దఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.  తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పత్తి రైతుల కుటుంబ సభ్యుల ఆందోళనకి దిగారు. దీనితో క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రైతుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కలెక్టర్ కుమార్ దీపక్ ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గొడవ సద్దు మణిగింది.