14-07-2025 12:30:03 AM
ఘట్ కేసర్, జూలై 13 : పేకాట వల్ల పచ్చని కుటుంబాలన్నీ నిలువునా నాశనమవుతున్నాయి. గతంలో పట్టణాలకే పర్మితం గా ఉండే ఈజూదక్రీడ పల్లెలకు విస్తరంచిం ది. సరదాగా మొదలై సునామిలా చుట్టేస్తుది ఈవ్యసనం. మర్యాద మంటల్లో కలసిపోయి నా భార్య, బిడ్డలు పస్తులు ఉండినా ఆ ఆట మాత్రం ఆగదు. ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని పలు గ్రామాలలో ఈజూదక్రీడ ని త్యం కొనసాగుతూనే ఉంది.
ఇటీవల పోలీసులు పేకాట అడ్డాలపై దాడులు జరిపి పదు ల సంఖ్యలో కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. అయినా ఈపేకాట ఆగిపోతుందని అనుకుంటే పొరపాటే. ఆయా గ్రామాలలోని రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, గ్రామ శివారులో ఉన్న పురాతన ఆలయాలు, వ్యవ సాయ బావులు, తోటలు, రిసారట్స్ లతో పాటు కొన్ని ఇళ్లను అడ్డాలుగా ఎంచుకొని పేకాట ఆడుతున్నారు.
పోలీసులు మాత్రం ఆగ్రామాల వైపు కన్నెత్తి చూడటంలేదని ఆ గ్రామాల ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. పేకాట ఆడుతున్న ఇంటి యజమా నికి పేకాట రాయుళ్లు ఆటకు కొంత నగదు చొప్పున ముట్టచెపుతున్నట్లు సమాచారం. కొన్ని పేకాట స్థలాలు పోలీసులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణ లు ఉన్నాయి. పేకాట ఆడేవారిలో కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాపారులు, ఉద్యోగులు, వృద్ధులతో పాటు కొంత మంది యువకులు సైతం పేకాటకు బానిసలై తమ కుటుం బాలను నాశనం చేసుకుంటున్నారు. ఈమ ధ్య ఓయో రూములను కూడా వదలకుండా అద్దెలకు తీసుకుని పేకాటలు ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడు లు జరిపి నిర్వాహకులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఇప్పటికైనా రాత్రి పగలు తేడా లేకుండా పేకాట ఆడుతున్న గ్రా మాలను గుర్తించి తనిఖీలను నిర్వహించి పేకాట స్థావరాలను ఏర్పాటు చేసే వారితో పాటు ఆడేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.