calender_icon.png 14 July, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుబాబుల మత్తు వదిలిస్తున్న పోలీసులు

14-07-2025 12:32:29 AM

  1. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
  2. పట్టుబడ్డ 528 మంది మందుబాబులు

శేరిలింగంపల్లి, జూలై 13: మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి మత్తు వదిలిస్తున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 528 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 391 మంది టూ వీలర్స్, 22 మంది త్రీ వీలర్స్,113 మంది ఫోర్ వీలర్స్, 2 హెవీ వెహికల్స్ వాహనదారులు ఉన్నారు.

అయితే తనిఖీల్లో పట్టుబడిన వారిలో 21-30 ఏళ్లు ఉన్నవారు 218 మంది కాగా.. 31-40 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 175 మంది ఉండగా, 41- 50 మధ్య వయసులో ఉన్నవారు 98 మంది ఉన్నారు. మొత్తం 528 మందిలో అందరూ పురుషులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పట్టుబడిన ప్రతి ఒక్కరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమై ఇతరుల ప్రాణాలు తీస్తే వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్ర్పై ప్రత్యేక దృష్టి సారించామని ఇందులో భాగంగానే వారాంతరాలతో పాటు సాధారణ రోజుల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.