20-08-2025 12:38:07 AM
అయిజ, ఆగస్టు,19:గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట యూరియా కొరత ని రసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు ది గారు.మంగళవారం మార్క్ ఫెడ్ నుంచి దాదాపు 300 బస్తాల యూరియా కార్యాలయానికి చేరుకుంది.దీంతో యూరియా కో సం రైతులు భారీగా కార్యాలయానికి తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ప్ర స్తుత పరిస్థితుల్లో రైతులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా ఇ తర కాంప్లెక్స్ ఎరువులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే రైతులకు సరఫ రా చేయాలని రైతులు కోరారు.