20-08-2025 12:37:15 AM
మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు సీఎంగా ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి జోగు రామ న్న ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్న సమయంలో వరదలు వస్తే టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పం ట నష్టపోయిన రైతులకు రూ.10,000 ఏమి సరిపోతాయని, ఎకరానికి రూ. 25 వేలు, మిర్చి రైతులకు రూ. 50 వేలు ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడుతాం అని, ఆనాడు సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే స్వయంగా సీఎంగా ఉన్నప్పుడు అప్పడు చెప్పిన నష్టపరియారాన్ని ఇప్పుడు ఎందుకు అందించడం లేదని మాజీ మంత్రి రామన్న మంగళవారం మీడి యా ద్వారా ప్రశ్నించారు.
టీపీసీసీగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు సీఎంగా ఉన్న రేవం త్ రెడ్డి అమలు చేయడం లేదంటే ఆయన పక్కా జూటే బాత్ సీఎం అని ఎద్దేవ చేశారు. ఆనాడు సీఎంగా కేసీఆర్ నష్టపరిహారం అందించిన రూ. 10 వేలనే నేటి సీఎం కొనసాగించడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిద ర్శనమన్నారు. నష్టంపై త్వరలో సర్వే చేయిం చి, బాధిత రైతులను ప్రజలను వెంటనే ఆదుకోవాలని రామన్న డిమాండ్ చేశారు.