25 May, 2026 | 1:05 AM

యుద్ధప్రాతిపదికన రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి

25-05-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరి వీరారెడ్డి

సంస్థాన్ నారాయణపూర్, మే 24: రైతులు పండించిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని రైతులనుండి అక్రమంగా వసూలు చేస్తున్న హమాలీ ఛార్జీలను వెంటనే అరికట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరి వీరారెడ్డి అన్నారు. ఆదివారం భాజపా నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.

హమాలీ ఛార్జీలు, సుతిలి దారం ఛార్జీలు అంటూ రైతులను అక్రమంగా దోచుకుంటున్నారని అన్నారు.కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని తీరు మార్చుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్,జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసోజు వెంకటాచారి,భాస్కర నరసింహ,బండమీది కిరణ్, తదితరులు పాల్గొన్నారు.