calender_icon.png 11 February, 2026 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పాం సాగుకు రైతుల మొగ్గు

11-02-2026 03:10:49 AM

  1. మూడేళ్ల కాలం.. 30 ఏళ్ల లాభం..
  2. మండల వ్యాప్తంగా 294 ఎకరాల్లో సాగు..
  3. నియోజకవర్గ కేంద్రంలో నెలకు 4 రోజులు పంట కొనుగోలు..
  4. లాభాలు పొందుతున్న రైతులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 10: ఒక్కసారి మొక్కలు నాటితే వాటికి 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ ఫాం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుంది.మొక్కల దగ్గర నుండి మార్కెటింగ్ దాకా ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

 సర్కారు ప్రోత్సాహం

 దేశంలో వంట నూనెల్లో ఎక్కువగా ఫాం ఆయిల్ వాడుతున్న విషయం తెలిసిందే.అయితే డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దేశీయం ఉత్పత్తి పెంచితే రైతులకు ఆదాయం పెరగడంతో పాటు దేశం ఆర్థికంగా ముందుకెళుతుందన్న లక్ష్యంతో ఆయి ల్ ఫాం సాగును ప్రోత్సహిస్తుంది.

ఇందులో భాగంగా నర్సరీలో ఒక్కో మొక్క రూ.193 ఉండగా రైతుల నుండి కేవలం రూ.20కి మాత్రమే వసూలు చేస్తున్నారు.మిగతా రూ.173(దాదాపు 90శాతం) ప్రభుత్వమే చెల్లిస్తుంది.అంతేకాకుండా మొక్క నాటిన నుండి నిర్వహణ ఖర్చుల కింద ఎగరాకు రూ.4200 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రభుత్వమే ప్రోత్సాహంగా అందిస్తుంది.

నియోజకవర్గంలో ఇలా.... 

తుంగతుర్తి నియోజకవర్గంలోని 6మండలాల్లో గతంలో కన్నా ఈసారి ఆయిల్ ఫాం తోటల సాగు పెరిగింది.జాజిరెడ్డిగూడెం మండలంలో 294 ఎకరాలు, మద్దిరాల 473,నూతనకల్ 377,తిరుమలగిరి 191,తుంగతుర్తి 514,నాగారం 347 మొత్తం నియోజకవర్గంలో 2196 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు పండించిన ఆయిల్ ఫాం సాగును కొనుగోలు చేయడానికి నియోజకవర్గ కేంద్రం తుంగతుర్తిలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి నెలలో ఆరు రోజులపాటు కొనుగోలు చేస్తున్నారు.దీంతో రైతులకు మద్దతు ధర దక్కుతుండడంతో పాటు విక్రయించడానికి సులువుగా మారింది.

రైతులకు ప్రోత్సాహకాలు

ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు కల్పి స్తుంది. 90శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తున్నాం.తుంగతుర్తిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తున్నాం.అధిక లాభాలు వచ్చే ఈ తోటను రైతులందరూ సాగుచేసి,మంచి లాభాలను పొందాలి.

 తీగల నాగయ్య (జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి)