19 August, 2026 | 3:57 AM

పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్

19-08-2026 12:00 AM

నివాళులర్పించిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి 

మహబూబ్ నగర్ అర్బన్ 18 : పేదల సంక్షేమం కోసం నిరంతర పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎంపి  డికె అరుణ అన్నారు.  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భం గా మహబూబ్నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తో కలిసి ఆమె పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా  సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సిజే బెనహర్,డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.