3 July, 2026 | 6:19 PM

Breaking News

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

ధాన్యం కొనాలని రైతుల ఆందోళన

13-05-2026 01:34 AM

హుస్నాబాద్‌లో పీఏసీఎస్ ఆఫీసు ఎదుట బైఠాయింపు

హుస్నాబాద్, మే 12 (విజయక్రాంతి): హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీకి చెందిన రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు గత 20 రోజులుగా ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రోడ్లపైనే, కేంద్రాల వద్దనే నిల్వ ఉంచాల్సి వస్తోందని, దీంతో ధాన్యం పూర్తిగా చెడిపోతున్న పరిస్థితి నెలకొన్నదని మంగళవారం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఈవో స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని రైతులు భీష్మించుకుని కూర్చొన్నారు.

కేబీ కాలనీ కొనుగోలు కేంద్రంలో హమాలీలు, లోడింగ్ సిబ్బంది లేరనే కారణాలతో ధాన్యం తూకం వేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక గోమాత రైస్ మిల్లులో మాత్రం హమాలీలు అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి రోజుకు ఒకటి, రెండు లారీల చొప్పున ధాన్యం తరలింపు కొనసాగుతోందని ఆరోపించారు. తమ కేంద్రం విషయంలో మాత్రం అధికారులు మొండిచేయి చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. గంటలోనే మీ ధాన్యాన్ని తూకం వేసి లారీల ద్వారా తరలిస్తాం అని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించినట్లు సమాచారం.