21-08-2025 12:39:40 AM
గంభీరావుపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభరావుపేట్ మండలంసరిపడ యూరియా లభించడం లేదంటూ గంభీరావుపేట మండల కేంద్రంలోని కామా రెడ్డిసిద్దిపేట ప్రధాన రహదారిపై బుధవారం రైతులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రుగాలం కష్టపడి పంటలు పండించినప్పటికీ, యూరియా సరఫరా అవ్వడం లేదని రైతులు మం డిపడ్డారు.
ప్రభుత్వం రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒక యూరియా బస్తా కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకొని రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా అయ్యే విధంగా చూడాలని కోరారు. రైతుల చేస్తున్న ధర్నకు స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు మద్దతుతెలిపారు.