21-08-2025 12:41:31 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 20 (విజయ క్రాంతి): బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లెంకల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ బీసీ సంక్షేమానికి, బీసీ విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు.
స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ఎమ్మెల్యేల కార్యా లయాలు, మంత్రుల కార్యాలతల ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోదుబ్బాసి ప్రణీత్, అజయ్, సాయి యాదవ్, రిషి యాదవ్, శ్రీకాంత్, తిరుమలేష్, సుకుమార్, తిరుపతి, రఘు, దేవేందర్, రాజేష్, మహేష్, సిద్దు, పవన్, కుమార్, తదితరులుపాల్గొన్నారు.