21-08-2025 12:39:31 AM
- అంతా గుంతల మయం
- ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం
- నిరంతర వర్షాలతో మరింత అధ్వాన్నం
ఇల్లెందు, ఆగస్టు 20,(విజయక్రాంతి):జాతీయ రహదారి అంటే సునాయాసంగా ప్ర యాణం చేయొచ్చు అనే నానుడి ఉంది. ప్ర స్తుతం మా నాన్నడి తిరగ రాయబడింది. అ డుగడుగునా గుంటలు... ఆదమరిస్తే హరి అన్నట్లు ఉంది 930 పి జాతీయ రహదారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఇల్లందు - కొత్తగూడెం 930 పీ హైవే రహదారిపై గుంతల మయంగా మారింది.
ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై భారీ వర్షాలకు గుంతలు మరింత ఎక్కువ ప్రాణా పాయస్థితికి చేరుకున్నాయి. గుంతలను పోర్చుచేం దుకు ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పొడవునా గుంతలతో మెయిన్ రోడ్డు ప్ర మాద భరితంగా మారడంతో, వాహనదారు లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2016 లో రూపకల్పన
హైదరాబాద్ ఓఆర్‌ఆర్ సమీపంలోని గౌరెల్లి వయా వలిగొండ నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్ వరకు 230 కి.మీ మేర రహ దా రిని ఎన్ హెచ్ 930-పీ గా జాతీయ రహదారుల ప్రాధి కారిక సంస్థ (ఎన్హె హెచ్‌ఎ) 2016 లో రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే జిల్లా పరిధి లోని నెహ్రూ నగర్ నుంచి కొత్త గూడెం క్రాస్రోడ్డు వరకు 52 కి. మీ మేర ఉన్న ఆర్ అండ్ బీ రహ దారిని 2018 లో ఎన్ హెచ్ తమ పరిధి లోనికి తీసుకుం ది.
దీంతో నాటి నుంచి రహదారి బాగోగులను జాతీయ రహదారుల విభాగం పర్య వేక్షిస్తోంది. అయితే రహదారి పై వాహనాల సంఖ్య పెరగడం, రహదారి సామర్ధ్యానికి మించి అధిక లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటం తో జాతీయ రహదారి అధ్వానంగా తయారైంది. ఓవర్ లోడ్ ను ఆదుపు చేయాల్సిన ఆర్టీవో అధికారులు మా మూళ్ల మత్తులో తూలుతూ ఏమీ పట్టనటు వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే రెండో అతిపెద్ద రద్దీ కలి గిన ఇల్లెందు-కొత్త గూడెం రహదారి మార్గం కావడంతో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి వయా ఇల్లెందు మీదుగా పారి శ్రామిక ప్రాంతమైన పాల్వంచ, జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, భద్రాచలం కు, అదే వి ధంగా పొరుగు రాష్ట్రాలైన ఎపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు వాహనాలు రాకపోలు సాగి స్తుంటాయి.
ఇల్లెందు-కొత్తగూడెం రహదారి సామర్ధ్యం 35 టన్నులు. ఈ రహదారిపై బొగ్గు లారీలు, ఇసుక లారీలు 50 టన్నుల లోడుతో రోజుకు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రమాదభరితం గా తయారైంది. హైవే అధికారులు కాస్త ద్రుష్టి సారిస్తే ప్రజలకు ఉపయోగం.
ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియదు
ఇల్లందు కొత్తగూడెం జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం సం భవిస్తుందోనని ప్రాణాలు అరచేతుల పె ట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. మో తాదుకు మించి బొగ్గు, ఇసుక లారీలు ప్రయాణించడం తో ప్రధాన రహదారి పై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ద్వి చక్ర వాహనంపై ప్రయాణిస్తే ఆదమరిస్తే హరి అన్న పరిస్థితి ఉంది. ఎన్ హెచ్ అ ధికారులు తక్షణమే గోతులను పూడ్చి ప్రమాదాల నివారించాలీ.
తేజావత్ మోహన్ ( టేకులపల్లి)
ఏకదాటి వర్షాల కారణంగా మరమతు చేయలేకపోతున్నాం
ఇల్లందు కొత్తగూడెం జాతీయ రహదారి ప్రస్తుతం సర్వే స్థాయిలో ఉందని. సర్వే పూర్తి అయితే తప్ప పనులు చేపట్టలేమన్నారు. రోడ్డుపై పడిన గోతులను మరమ్మతు చేయాలంటే వర్షం పూర్తిగా తగ్గి ఎండితే తప్ప పని చేయలేమన్నారు.
ఎన్ హెచ్ డి ఈ నల్లనీ