calender_icon.png 1 September, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్పల్ లో విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతుల ఆందోళన

31-08-2025 01:05:31 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ రైతులు ఆదివారం కడ్పల్ సబ్స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైతులు సబ్ స్టేషన్ ఆపరేటర్లతో వాగద్వానికి దిగారు. రైతులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గారడి మాటలు చెబుతూ... కనీసం 14 గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా మోసం చేస్తూ.. పబ్బం గడుపుతున్నారని, అందులో సబ్స్టేషనలో విద్యుత్ అధికారులు, సబ్స్టేషన్లో అప్రేటర్లు 10 గంటలు అదికూడా సరిగా ఇవ్వకుండా గత వారం నుండి సరిగా ఇవ్వక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లు సరిగా అందక పంటలు చేతికొచ్చేలా లేవని సబ్ స్టేషనన్ను కడ్పల్ గ్రామానికి చెందిన దాదాపుగా 100 మందికి పైగా రైతులు ముట్టడించి సబ్ స్టేషన్లో ఉన్న విద్యుత్ శాఖ సిబ్బందితో వాగ్వద్దనికి దిగారు.

సంఘటన స్థలంలో రైతులకు విద్యుత్ సిబ్బందికి తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. రైతులు కరెంట్ కోతల బాధను విద్యుత్ శాఖ ఏడితో చరవాణిలో గ్రామస్థులు మాట్లాడుతూ 14గంటల్లో ఏడు ఎనిమిది గంటలు నిరంతర కరెంట్ వస్తుందని ఆశలు పెట్టుకుంటే ఆ కరెంట్ కూడా రాత్రి ఒంటి గంట సమయంలో కరెంట్ ఇస్తే రైతులు ఎప్పుడు పంట పోలాలవద్దకు వెళ్ళాలి. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడే నాథుడే ఉండరు. కడ్పల్ గ్రామంలో త్రి ఫీజ్ కరెంట్ సరిగా ఇవ్వక పోవడంతో గ్రామంలో నల్ల నీళ్లు వారం నుండి మూడు రోజులకు ఒక్కసారి వద్లుతున్నారు. నీళ్ల లేక గృహిణిలు ఇబ్బంది పడుతున్నారని ఏడితో రైతులు మోర పెట్టుకున్నారు. ఏడి మాట్లాడుతూ... విద్యుత్ రైతులకు అందేలా చూస్తామని, రాత్రి ఒంటి గంటకు కాకుండా రాత్రి 9 గంటలకు అందేలా చూస్తాని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరామించుకున్నారు.