calender_icon.png 1 September, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూవివాదంలో గొడ్డలితో దాడి.. వ్యక్తి మృతి

31-08-2025 12:52:58 PM

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఘటన..

ఇబ్రహీంపట్నం: భూ వివాదంలో గొడ్డలితో దాడి చేసిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో ఇరువర్గాల మధ్య భూ భూవివాదం తలెత్తగా, తమ్ముడు కుటుంబంపై అన్న కుటుంబం గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గొడ్డలితో దాడి చేయగా తమ్ముడు గుద్దేటి బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు భార్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.