10 June, 2026 | 10:07 PM

రైతులకు మెరుగైన సేవలందించాలి

16-06-2024 01:25 AM
  • ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

మంచిర్యాల, జూన్ 15 (విజయక్రాంతి): రైతులకు అందుబాటులో ఉంటూ, వారికి మెరుగైన సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మార్కెట్ కమిటీ పాలకవర్గానికి సూచించారు. శనివారం లక్షెట్టిపేట మార్కెట్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా దాసరి ప్రేంచంద్, ఉపాధ్యక్షుడిగా ఎండీ ఆరీఫ్‌తోపాటు 12 మంది సభ్యులతో మార్కెటింగ్ ఏడీ గజానంద్ ప్రమాణం చేయించారు. పాలకవర్గాన్ని ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ప్రభుత్వ కళాశాల, పాఠశాలల్లో నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు.