10 June, 2026 | 11:21 PM

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి ఆసరా

16-06-2024 01:23 AM
  • ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి

33 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

హనుమకొండ, జూన్ 15 (విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఆసరాగా మారిందని పరకాల ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.