10 June, 2026 | 9:01 PM

వర్షకాలంలో అప్రమత్తంగా ఉండాలి

16-06-2024 01:28 AM
  • అత్యవసర పరిస్థితుల్లో స్పందించగలగాలి

కమాండ్ కంట్రోల్‌కు సీసీ కెమెరాలు అనుసంధానించాలి

హోంగార్డుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలి 

ఉన్నతాధికారులకు  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శనలో పలు సూచనలు 

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలి సి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంద ర్శించారు. వర్షాకాల ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాల ని, ఔటర్ రింగ్‌రోడ్డును యూనిట్‌గా తీసు కుని డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని  అధికారులకు సీఎం నిర్దేశం చేశారు.

ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాల న్నింటిని వీలైనంతవరకు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలన్నారు.  అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసేలా పటిష్టమైన వ్యవస్థలను ఏర్పా టు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ఫిజి కల్ పోలిసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ను హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పా టుచేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య లను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్‌గార్డులను రిక్రూట్‌మెంట్ చేపట్టాలని సూచించారు. 

ఇప్పటికే 141 వరద తీవ్రత ఉండే  ప్రాంతాలను  గుర్తించి నట్లు, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి నట్లు అధికారులు వివరించారు. రోడ్డు పై నీరు నిల్వకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌తో పాటు కమాండ్ కంట్రోల్‌ను సందర్శించిన వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నారు.