19-05-2025 03:21:55 PM
రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు
హుజురాబాద్ ఏసీపీ జి.శ్రీనివాస్
హుజురాబాద్,(విజయక్రాంతి): రైతులు రోడ్లపైన ధాన్యం అరబోయవద్దని, రైతులు సహకరించుకుంటే కేసులు తప్పవని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు రోడ్డుపై దాన్యం ఆరబోయకుండా సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపైధాన్యం నిల్వ చేయడంతో రాత్రివేళలో. వాహనదారులు అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో రైతులు కల్లాల వద్ద ధాన్యాన్ని అరపోసుకోవాలని కోరారు. ఇప్పటికైనా రైతులు రోడ్లపై ధాన్యం అరబోయకుండా సహకరించాలని కోరారు. ఎవరైనా రైతులు రోడ్లపై దాన్యం ఆరబోస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులపై పోలీసులకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని రైతులు కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.