calender_icon.png 19 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల ప్రాణాలు నాకు ముఖ్యం

19-05-2025 03:15:19 PM

ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గుంతలపై, సర్వీస్ రోడ్ల నిర్వాహనపై టోల్ గేట్ నిర్వాహకులపై రామగుండం ఎమ్మెల్యే ఆగ్రహం

పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రయాణించే ప్రయాణికుల ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యమని రామగుండం-పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఉన్న బసంత నగర్ లోని టోల్ గేట్ నిర్వాహకులపై ఎమ్మెల్యే  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేట్ నిర్వాహకులు ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ, ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటులో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ వసూళ్లు సజావుగా జరుగుతున్నా, సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉద్యోగుల వేతనాలపై నిర్లక్ష్యంగా 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు.

లారీ డ్రైవర్లకు మినహాయింపులు ఇవ్వాలి

 గోదావరిఖని నుండి లోడ్ తీసుకెళ్లి తిరిగివస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలనీ, ఇది వారి భద్రత కోసం అవసరమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. సానిటేషన్, ప్రజా సౌకర్యాల కొరత: స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే దృష్టితో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానికులకు అన్యాయం జరుగుతుందని, సంస్థ స్థానికులను నిర్దిష్ట కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తూ, బయట ప్రాంతాలవారిని నియమించడం పూర్తిగా అన్యాయమని గట్టిగా తెలిపారు.

సర్వీస్ రోడ్ల నిర్వహణ లోపాలపై స్పందించాండి

 సర్వీస్ రోడ్ల నిర్వహణ లోపాల పై స్పందించాండని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందనీ, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.