20-08-2025 01:18:59 AM
నర్మేట, ఆగస్టు 19 (విజయ క్రాంతి): రైతులకు కావలసిన యూరియా మండలంలో అందుబాటులో ఉందని, రైతులు పీడియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. మంగళవారం నర్మెట్ట మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రాలను వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అంబిక సోనీ, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కరుణాకర్ తో కలిసి తనిఖీ చేశారు.
మండలంలోని పిఎసిఎస్, ఆగ్రోస్, ఓడీసీఎంఎస్ కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ ఎరువుల గురించి ఆందోళన చెందరాదని సమృద్ధిగా నిలువలు ఉన్నట్లు తెలియజేశారు. ప్రతి రైతుకు ఒకటి, లేదా రెండు బస్తాలు అవసరాలను బట్టి కొనుగోలు చేయాలన్నారు. యూరియాను కొనుగోలు చేసేటప్పుడు రైతులు భూమి వివరాలు ఆధార్ కార్డును పరిశీలించి ఇవ్వవలసిందిగా వ్యాపారస్తులకు సూచించారు.
రెండు రోజులకోసారి యూరియా వస్తుందని ఒకటి రెండు బస్తాల తర్వాత వారి విస్తీర్ణాన్ని బట్టి మళ్ళీ తీసుకోవచ్చని కలెక్టర్ రైతులకు తెలియజేశారు. ఇప్పటి వరకు మండలంలో 850 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు . ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి నిర్వాహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు.