7 May, 2026 | 2:09 AM

రామోజీ అకుంఠిత దీక్షాపరుడు

24-06-2024 12:05 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/ రాజన్న సిరిసిల్ల, జూన్ 23 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నివాసానికి వెళ్లి ఆయన కుమారుడు కిరణ్ దంపతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావుతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.  మీడియా ద్వారా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా రాజీ పడకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, నిర్భీతితో ముందుకుసాగిన అకుంఠిత దీక్షాపరు డు, అవిశ్రాంత కలం యోధుడు రామోజీరావు అని అన్నారు. 

చిరంజీవితో భేటీ

ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో బండి సంజయ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఎదిగారని, కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారని సంజయ్‌ను చిరంజీవి ప్రశంసించారు. అగ్రెసివ్‌గా ముందుకు సాగిన ఆయనకు తగిన ప్రాతినిధ్యం లభించిందని అభినందించారు. విద్యార్థి దశలో చిరంజీవికి తాను పెద్ద అభిమానినంటూ సంజయ్ గుర్తుచేసుకున్నారు.  

రామకృష్ణ, మేడిపల్లికి పరామర్శ

సతీవియోగంతో బాధపడుతున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బండి సంజయ్ పరామర్శించారు. సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇటీవల గుండె ఆపరేషన్ చేయిం చుకుని మియాపూర్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను పరామరిం చారు. బండి సంజయ్‌తోపాటు వారణాశిలోని కాశీ విశనాథ ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్‌మిశ్రా గురూజీ, ఎనీఎస్‌ఎస్ సుభాశ్, సంగప్ప తదితరులు ఉన్నారు.