9 April, 2026 | 2:25 AM

తుంగతుర్తి తాసీల్దార్ కార్యాలయంలో రైతుల ధర్నా

03-01-2026 12:00 AM

అక్రమంగా పట్టా చేసిన తాసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని రైతుల వేడుకోలు

తుంగతుర్తి, జనవరి 2: రావులపల్లి గ్రామంలో గత కొంతకాలంగా రైతుల ఆధీనంలో ఉన్న భూములను స్థానిక తాసిల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ, శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట రావులపల్లి బాధిత భూముల రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టిఆర్‌ఎస్ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు రైతులకు సంఘీభావం వ్యక్తం చేసి పలువురు మాట్లాడారు.

గ్రామంలో 25 సంవత్సరాల క్రితం కొన్న భూములు, నేడు గ్రామానికి చెందిన సౌజన్య రెడ్డి దౌర్జన్యంతో, తమ వద్ద నుండి, బెదిరింపులకు గురి చేస్తూ ,భూముల పట్టా మార్పిడి కార్యక్రమం చేపట్టినట్లు ఆరోపించారు. దీనికి తోడు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్కు వెళితే, పోలీసులు కూడా అక్రమంగా మాపై కేసులు పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు కావాలని, మాపై గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

రావులపల్లి గ్రామంలో దళిత రైతులపై జరుగుతున్న సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నందనల్ పవర్, జిల్లా ఎస్పీ నర్సింహ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు నాయకులు తాటికొండ సీతయ్య బుర్ర శ్రీనివాస్, గుండ గాని రాములు గౌడ్, రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, గోపగాని రమేష్ గౌడ్, రావులపల్లి రైతులు పాల్గొన్నారు.