03-01-2026 12:00:00 AM
కోదాడ, జనవరి 2: కబడ్డీ క్రీడకు ప్రాణం పోసి జాతీయ స్థాయిలో కోదాడ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడా మాంత్రికుడు స్వర్గీయ ఖాజా భాయ్ ఆశయాలను సాధించాలని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎండి మహబూబ్ జానీ అన్నారు. ఖాజా భాయ్ 36 వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ నివాసంలో అన్ని పార్టీల నాయకులు, కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో కేబి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, ఎంఈఓ సలీం షరీఫ్, బాగ్దాద్, భాజాన్, షఫీ,శామీ, ఖాజా మొయినుద్దీన్, మాతంగి బసవయ్య, కొండలు నామా నరసింహారావు, కాంపటి శ్రీను, లాయర్ రాజన్న, పంది తిరపయ్య, గంధం పాండు, రామారావు, పిడతల శ్రీను, రహీం, ఖాజా గౌడ్, బాబా, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.