29 May, 2026 | 2:56 AM

అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

29-05-2026 01:29 AM

స్థానిక నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం పరిశీలన 

బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు

గద్వాల, మే 28 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎన్నో ఆశలతో తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ సరైన సదుపాయాలు లేక రోజుల తరబడి రోడ్లపైనే ధాన్యాన్ని ఉంచాల్సిన దుస్థితి ఏర్పడిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కురిసిన అకాల వర్షాలతో కొను గోలు కేంద్రాల వద్ద పేరుకుపోయిన వడ్లు పూర్తిగా తడిసి మొలకెత్తాయని, దీంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు.

కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం అవుతున్నా కాంగ్రెస్ ప్రభు త్వం పట్టించుకోకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, హమాలీలు,లారీలు అందుబాటులో లేక రైతులు రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. గత 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోయి చివరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ రైస్ మిల్లుల ప్రైవేట్ దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన వడ్ల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన పరిహారం ప్రకటించాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటేల్ జనార్దన్ రెడ్డి, శేఖర్ నాయుడు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.