29 July, 2026 | 9:39 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

‘బొక్కస్గాం’ను చుట్టుముట్టిన రైతులు

28-05-2026 02:08 AM

సిర్గాపూర్, మే 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని బొక్కస్గాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని రైతులు చుట్టుముట్టారు. స్థానికంగా వరి ధాన్యం కొనుగోలు బాధ్యతను ఐకేపీ కేంద్రానికి అప్పగించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలోనే అన్ని పంటలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తమ సొసైటీకి కాకుండా ఐకేపీకి బాధ్యతలు అప్పగించడం సరికాదని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పిఎసిఎస్, ఐకెపికి చెందిన ఇరువర్గాలు ఒకరి పై ఒకరు ఘర్షణకు దిగే సమయంలో పోలీసులు ఇరువర్గాలను చెదారగొట్టారు.