ధాన్యం కొనకుంటే అధికారుల ఇండ్ల ఎదుట పోస్తాం
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, మే 27 (విజయక్రాంతి): రెండు రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ ధాన్యాన్ని జిల్లా అధికారుల ఇండ్ల ఎదుట పోస్తామని.. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బుధవారం కరీంనగర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించా రు. మొదటగా రూరల్ మండలంలోని నగునూరులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే గంగులకు వారి గోడును వెళ్ళబోసుకున్నారు. ధాన్యం తీసుకువచ్చి నెలన్నర గడుస్తున్న.. పట్టించుకున్న నాథుడు లేడని.. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసిందని.. ఈ ధాన్యాన్ని కొనకపోతే మాకు ఆత్మహత్య శరణమని ఎమ్మెల్యే గంగుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆవేదనను చూసి చలించి పోయిన ఎమ్మెల్యే గంగుల.. అప్పటికప్పుడు జిల్లా అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడారు.. ఏఎంసి లో ఉన్న గోదాం నెంబర్ 7 ను.. రైతుల ధాన్యం నిలు వ కోసం కేటాయించాలని వారిని కోరారు. అప్పటికప్పుడు.. కూలీలను ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి.. ట్రాక్టర్లను ఏర్పాటు చేసి.. దగ్గరుండి మరీ ధాన్యాన్ని అధికారులతో కాంట వేయించి రైస్ మిల్లులకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ... ఎప్పటినుండో ప్రభుత్వాన్ని హెచ్చ రిస్తున్నామని..ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలలో.. గన్ని సంచుల కొరత, టార్పాలిన్ల కొరత హమాలీ కొరత, రవాణా కొరత ఇలా ఏ విభాగంలో చూసిన ప్రభుత్వ అలసత్వం కొ ట్టొచ్చినట్టు కనబడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ప్రతిగింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వంను మేము హెచ్చరించినప్పటికీ వారిలో మార్పు రాలేదన్నారు. మా బిఆర్‌ఎస్ హయాంలో... కెసిఆర్ పాలనలో మే 5వ తేదీలోగా కొనుగోళ్ళు పూర్తి చేసి రైతులకు డబ్బులు చెల్లిం చామన్న ఆయన... కాంగ్రెస్ పాలనలో మే మాసం చివరికి వచ్చినప్పటికీ... 50 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నారు.
కొనుగోళ్ళలో అటు రైస్ మిల్లర్ల పైన... ఇటు అధికారుల పైన ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడుతారని ఆనాడే చెప్పామన్న గంగుల... ఇప్పుడు అకాల వర్షంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయమంటున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. మీ జాప్యంతోనే ధా న్యం తడిసిందని... మీరు కొనుగోలు చేయకపోతే... అధికారుల ఇంటి ముందు పారబో స్తామని చెప్పడంతో... ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను రీ ఓపెన్ చేశారన్నారు. రెండు రోజుల్లో తడిసిన... తడవని ప్రతిగంజను కొనుగోళ్ళు పూర్తి చేయాలని... లేక పోతే అధికారుల ఇంటి ముందే పోసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షెడ్ ప్యాక్ ఛైర్మెన్ తోట తిరుపతి, ఫాక్స్ డైరెక్టర్ లక్ష్మ య్య, మహేందర్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, రంగారెడ్డి, కోటేశ్వర్, వినయ్, అరే శ్రీకాంత్, భద్రయ్య, రామ్ రెడ్డి,నేతి రవి వర్మ, పలువురు బారసా నాయకులు తదితరులు పాల్గొన్నారు.






