calender_icon.png 1 July, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం

04-12-2024 01:35:19 AM

రాష్ట్రరెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రరెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జీళ్లచెరువులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

మల్లేపల్లిలో రూ.29.70 లక్షలు, గట్టుసిం గారంలో రూ.20 లక్షలు, కూసుమంచిలో రూ.53 లక్షలు, నర్సింహులగూడెంలో రూ.15 లక్షలతో నిర్మించనున్న రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు రూ.17.28 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన ఉంటుందని, పేదల, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, సర్కార్ రైతు సంక్షేమం కోసం 27 రోజుల్లోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని కొనియాడారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య పాల్గొన్నారు.