24 April, 2026 | 1:59 PM

తడిసిన ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో

29-05-2025 12:09 AM

బైంసా, మే ౨౮ (విజయక్రాంతి): బైంసా మండలంలోని కత్తిగాంలో వర్షాల కారణం గా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ బుధవారం బైంసా పట్టణంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. 

నిర్మల్ భైంసా జాతీయ రహదా రిపై ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికంగా అధికారులు వరి ధాన్యం తూకం వేయకుండా ఇబ్బందు లు పెడుతున్నారని వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశా రు. పోలీసులు అక్క డ చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడించి ఈ ఆందోళన విరమింపచేశారు