17-07-2025 01:41:17 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసిలో చేపట్టుతున్న రోడ్డు భద్రత చర్యలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటెన్సివ్ మెయింటనెన్స్ డ్రైవ్‌లో భాగంగా గుర్తించిన పాట్ హోల్స్‌లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 3,462 మరమ్మతులు చేపట్టారు.
మంగళవారం వరకు 2,872 పూర్తి చేయగా బుధవారం 612 పూర్తి చేశారు. ఇంకా నేడు క్యాచ్ పిట్ 99అటెండ్ చేయగా అందులో 26 క్యాచ్ పిట్ కవర్ రీప్లేస్మెంట్ చేశారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మొత్తం పాట్ హోల్స్ ప్రజలకు ఇబ్బందులకు గురి కాకుండా మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఈ సహదేవ్ రత్నాకర్‌ను కమిషనర్ ఆదేశించారు.